Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదన్న జగన్

AP: వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదన్న జగన్

విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదంటూ సీఎం జగన్ ఆదేశించారు.
ఆ మేరకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్న జగన్.. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్న సర్కారు.. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించిన అధికారులు.
మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామని విద్యుత్ శాఖ స్పష్టంచేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News