Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలతో లైంగిక వేధింపులకు ఫుల్ స్టాప్

AP: ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలతో లైంగిక వేధింపులకు ఫుల్ స్టాప్

మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని రాష్ట్ర మంత్రి కె.వి. ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోను, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు.

- Advertisement -

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆద్వర్యంలో “పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013” అమలు తీరుపై జరిగిన సమీక్షా సమావేశంలో.. మహిళా సాధికారతకు బడ్జెట్ లో కూడా భారీ మొత్తంలో నిధులను మహిళల సంక్షేమం, అభివృద్దికే కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంద్రప్రదేశ్ లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ఇంతవరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ..మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తున్నదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News