విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరుగనుంది. పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సానుకూలతలను ఈ సదస్సు వేదికగా ప్రభుత్వం వివరించనుంది. కీలక అంశాలపై సదస్సునుద్దేశించి పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు ప్రసంగించనున్నారు. తర్వాత కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోనున్నారు. దీని తర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు జరుగనున్నాయి. పలువురు వ్యాపారవేత్తలతో జగన్ ముఖాముఖి చర్చలు జరపనున్నారు. సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
AP: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై సమీక్ష
సంబంధిత వార్తలు | RELATED ARTICLES