మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అవినీతి చోటు చేసుకుంటుంది అవినీతిని అరికట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు మండల ఉపాధ్యక్షులు పి ఏసన్న మండల సహాయ కార్యదర్శి బి అశోక్ డిమాండ్ చేశారు. స్థానిక సరస్వతి స్కూల్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కొత్తపల్లి మండలానికి తాత్కాలిక ఏపీవోలు మాత్రమే వస్తున్నారని, క్షేత్రస్థాయి సిబ్బంది అంగన్వాడీలు ఆశ వర్కర్లు కళాశాల విద్యార్థుల పేర్లతో బోగస్ మస్టర్ నమోదు చేసుకొని పనికి రానివారికి సగం డబ్బులు ఇచ్చి మిగిలిన సగం డబ్బులు నొక్కేస్తున్నారని ఆరోపించారు. జాబ్ కార్డు కావాలంటే 500 రూపాయలు నుండి వెయ్యి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీడీవో గారి దృష్టికి ఉపాధి కూలీలు ఈ అవినీతిపైన ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని.. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మండలంలో అవినీతిపై విచారణ జరిపి క్షేత్రస్థాయి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి పకీరయ్య కే రాజు కే రమణయ్య పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
AP vyavasaya Karmika sangham: ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES