వరుస అల్పపీడనాలతో ఏపీకి వర్షసూచనలు జారీ అవుతున్నాయి. తాజాగా మరోసారి వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయుల్లో తూర్పు, ఈశాన్య గాలులు బలంగా వీయడం వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర కోస్తాలోని జిల్లాల్లో రేపు ఒకట్రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మరో మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడేంతవరకూ చలితీవ్రత ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది. ఏపీలో తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో, తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలు పొగమంచుతో ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది.