రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి, దీనికి ఉక్కపోత కూడ తోడవుతుంది. వాతావరణంలోని మార్పుల వలన ఈ పరిస్థితి నెలకొంది. మాములుగా అయితే మే నెల నుంచి ఆగష్టు వరకు ఆంధ్రప్రదేశ్ వాతావరణం పై సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అయితే, భూమి ఉపరితలం పైకి వచ్చే సూర్యకిరణాల ప్రసరణ వర్షాకాలంలో ఉండే మేఘాల కారణంగా వేసవితో పోలిస్తే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ పైభాగంలో మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
AP weather alert: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, జాగ్రత్త
సంబంధిత వార్తలు | RELATED ARTICLES