Homeఆంధ్రప్రదేశ్Weather : ఉపరితల ఆవర్తన అలజడి: ఏపీలో పిడుగుల వర్షం.. ఆ జిల్లాలకు అలెర్ట్!

Weather : ఉపరితల ఆవర్తన అలజడి: ఏపీలో పిడుగుల వర్షం.. ఆ జిల్లాలకు అలెర్ట్!

Andhra Pradesh Rain Lightning Alert : రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. భానుడి భగభగలతో ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం లభించడంతో పాటు, మరోవైపు పిడుగుల ముప్పు పొంచి ఉందంటూ వాతావరణ శాఖ సంకేతాలు పంపింది. బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాష్ట్ర వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ఫలితంగా గురువారం (06-08-2026) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం – ఏపీSDMA ప్రకటన : రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల గురువారం రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడటంతో పాటు వర్షపాతం నమోదుకానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆవర్తనం వల్ల గాలిలో తేమ పెరిగి మేఘాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే జిల్లాలు : రాష్ట్రంలోని 7 జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేకాధికారులు అప్రమత్తం చేశారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, రైతులు, గొర్రెల కాపరులు వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని అధికారులు హెచ్చరించారు. అవి, శ్రీకాకుళం, పోలవరం (పరిసర ప్రాంతాలు), డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటుగా తిరుపతిగా పేర్కొంది.

తేలికపాటి వర్ష సూచన ఉన్న జిల్లాలు : రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు లేదా వర్షం పడే అవకాశం ఉందని APSDMA తన ప్రెస్ నోట్‌లో పేర్కొంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు. ఈ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, ఉరుములు వచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరమని తెలిపింది.

ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సురక్షిత సూచనలు : వర్షాల వేళ పిడుగుపాటు వల్ల సంభవించే ప్రమాదాలను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర జాగ్రత్తలు జారీ చేసింది. చెట్లు, పోల్స్ వద్ద నిలబడరాదు: వర్షం పడేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తే పొలాల్లో ఉండే చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల  వద్ద గానీ నిలబడకూడదు. హోర్డింగ్స్‌కు దూరంగా ఉండాలి: ఈదురుగాలుల ధాటికి ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ విరిగిపడే ప్రమాదం ఉన్నందున రహదారులపై ప్రయాణించేవారు వాటి కింద ఆశ్రయం పొందకూడదు. వర్షం పడుతున్న సమయంలో పక్కా భవనాలు లేదా కాంక్రీట్ నిర్మాణాల నీడన ఉండటం సురక్షితం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News