Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

AP: గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల శాసనమండలి ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 13వ తేదీన ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు.
జిల్లాలో 169 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈనెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక వెబ్ కాస్టర్ విధులు నిర్వహిస్తారని, అవసరమైన చోట వీడియో గ్రాఫర్లను నియమించామన్నారు. భద్రతాపరంగా ఎక్కడా ఇటువంటి లోటుపాట్లు లేకుండా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామన్నారు. ఓటర్లు సరైన పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తులు ఉండవని, బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి ఫోటో, పేరు మాత్రమే ఉంటుందన్నారు.

- Advertisement -

ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటుచేసిన పెన్నుతోనే తమకు నచ్చిన అభ్యర్థి ఫోటో, పేరు ఎదుట తెలుగు సంఖ్యలు లేదా రోమన్ సంఖ్యలను ప్రాధాన్యతా కార్యక్రమంలో వేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించమన్నారు. భారత ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. ఓటర్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పోలింగ్ కేంద్రంలో సిద్ధం చేశామని, ఓటర్లందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News