HomeTop StoriesTransgenders Welfare Board: ట్రాన్స్‌జెండర్ల వెల్ఫేర్‌ బోర్డుకు సభ్యుల నియామకం.. ప్రతినిధులు వీరే.!

Transgenders Welfare Board: ట్రాన్స్‌జెండర్ల వెల్ఫేర్‌ బోర్డుకు సభ్యుల నియామకం.. ప్రతినిధులు వీరే.!

Transgenders Welfare Board AP Government: ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ట్రాన్స్‌జెండర్ల వెల్ఫేర్‌ బోర్డుకు సభ్యులను నియమిస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు విశాఖపట్నం, తిరుపతి జిల్లాల కలెక్టర్లను ప్రాంతీయ ప్రతినిధులుగా నియమించింది. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్ల సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/brs-and-congress-leaders-express-anger-over-cancellation-of-neet-exam/

రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వెల్ఫేర్‌ బోర్డులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన కోట ప్రేమ్ సాగర్ రాయ్, గుంటూరు జిల్లాకి చెందిన నక్క జీవన్ కుమారి, ప్రకాశం జిల్లాకి చెందిన బోను దుర్గ ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులుగా కొనసాగుతారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/nara-lokesh-meets-nitin-gadkari/

సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన స్థానం కల్పించడం, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత వంటి సమస్యల పరిష్కారానికి ఈ బోర్డు ఒక వారధిలా పనిచేయనుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News