Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్APSDMA: ఖరీఫ్ 2024 కరువుపై కేంద్రానికి రిపోర్ట్

APSDMA: ఖరీఫ్ 2024 కరువుపై కేంద్రానికి రిపోర్ట్

నష్టపరిహారం

ఖరీఫ్ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్రబృందాన్ని సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్, ఆర్పీ సిసోడియా కోరారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో గురువారం కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్ దేవి నేతృత్వంలోని కేంద్ర బృందంతో సమావేశమై రాష్ట్రంలో కరువు పరిస్థితులను వివరించారు.

- Advertisement -

కేంద్రబృందం సభ్యులు సుప్రియా మాలిక్, డిప్యూటీ డైరెక్టర్,డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సపెండిచర్., అనురాధ బట్నా సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, నీతి ఆయోగ్., డా. దీపాంకర్ సేథ్, అసిస్టెంట్ కమిషనర్, D/o పశు సంవర్ధక శాఖ., డా.ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్,వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ., శ్రీ.మన్నూజీ ఉపాధ్యాయ్, డైరెక్టర్, సెంట్రల్ వాటర్ కమిషన్., జయంతి,అండర్ సెక్రటరీ, గ్రామీణ అభివృద్ధి శాఖ., డా. కె. పొన్నుస్వామి, డైరెక్టర్, ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ ఈ మేరకు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో భేటీయై చర్చించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు జిల్లాల్లోని 54 మండలాలు (అన్నమయ్య – 19, చిత్తూరు – 16, శ్రీ సత్య సాయి – 10, అనంతపురం – 7 మరియు కర్నూలు – 2) ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వాటిలో 27 తీవ్ర కరువు మండలాలు, 27 మధ్యస్థ కరువు మండలాలు. కేంద్ర కరువు మాన్యువల్ ప్రకారం సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం, వర్షాభావంతో అత్యధిక డ్రైస్పెల్స్, రిమోట్ సెన్సింగ్, సాయిల్ మోయిశ్చర్, హైడ్రాలజీ, పంట నష్టం 33% అంతకంటే ఎక్కువ ఉన్న మండలాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించిందని అన్నారు.

కరువు ప్రభావంతో పత్తి, జొన్న, వేరుశెనగ, ఎర్ర శనగలు, మొక్కజొన్న మొదలైన 14 రకాల పంటలు దెబ్బతిని ఐదు జిల్లాల్లోని 1.06 హెక్టార్ల విస్తీర్ణంలో 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1 లక్ష మంది రైతులకు రూ.16.67 కోట్ల వ్యయంతో సుమారు 1 లక్ష మంది రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు, రూ.55.47 కోట్ల వ్యయంతో పశుగ్రాసం, పశుగ్రాస విత్తనాల సరఫరా, 60% సబ్సిడీపై TMR (Total Mixed Ratio), 40% సబ్సిడీపై చాఫ్ కట్టర్లు, మందుల సరఫరా వంటి ఉపశమన చర్యలు చేపట్టినట్లు కేంద్ర బృందానికి సిసోడియా వివరించారు.

వ్యవసాయ శాఖ ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ. 90.62కోట్లు, రూరల్ వాటర్ సప్లై రూ. 0.78 కోట్లు, అర్బన్ వాటర్ సప్లై రూ. 4.89 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.55.47 కోట్లు ఆర్థిక సహాయం అవసరమన్నారు. క్షేత్రస్థాయిలో కరువు నష్టానికి సంబంధించి వాస్తవిక వివరాలను అందించామని, రైతులను ఆదుకోడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్ దేవి మాట్లాడుతూ..కరువు కారణంగా నష్టపోయిన పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు. పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామన్నారు. అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కరువు మండలాల్లో రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను గమనించామని తమ నివేదికలో కేంద్రానికి అన్ని విషయాలను సమగ్రంగా తెలుపుతామని అన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కరువు పరిస్థితుల తెలియజేశాయని పేర్కొన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో రైతులు కరువు వల్ల తమకు జరిగిన నష్టాన్ని వివరించారని చెప్పారు. త్వరగా కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని పెరిన్ దేవి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పీఆర్ & ఆర్డి, పశు సంవర్థక శాఖ, RWS , పబ్లిక్ హెల్త్ మరియు అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News