ఏపీలో పెద్ద పండుగకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో పండుగను కుటుంంబసభ్యులతో ఆనందంగా జరుపుకునేందుకు చిన్నా, పెద్దా, ముసలి, ముతక ఎక్కడున్నా సరే తమ ఊరికి చేరుకుంటున్నారు. సంవత్సరమంతా ఎవరు ఎక్కడున్నా సరే సంక్రాంతి(Sankrani Festival) పండుగకు మాత్రం ఊరికి వచ్చి ఆ నాలుగు రోజులు అయినవాళ్లతో పండుగ జరుపుకుని సంతోషంలో మునిగితేలుతారు. దీంతో పండుగకు ఊరు రావడానికి బస్సులు, రైళ్లు ఎప్పుడో ఫుల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు(Sankranti Special Buses) నడపాలని APSRTC అధికారులు నిర్ణయించారు.
జనవరి 8 నుంచి మొదలు 13 వరకూ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి పలు చోట్లకు 2,153 బస్సులు.. బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇక తిరుగు ప్రయాణంలో ఈనెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నామని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలుండవని స్పష్టం చేశారు. ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.