ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్ల(Araku Coffee Stall)ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ రఘురామ, పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు కాఫీ అందించారు. ఇక మండలి ఆవరణలో మరో కాఫీ స్టాల్‌ను ఛైర్మన్ మోషేను రాజు ప్రారంభించారు.

