ఉత్తరాంధ్రలోని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో రెండు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసిన విషయం విధితమే. తాజాగా పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ(Araku Coffee) స్లాళ్లను ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ.. ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసింది.
కాగా అరకు స్టాళ్లను ఏర్పాటు చేయాలని కూటమి ఎంపీల విజ్ఞప్తితో సంగం 1, 2 క్యాంటీన్ కోర్టు యార్డ్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఇటీవల అనుమతించారు. ఆయన ఆదేశాలతో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 28 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు ఆవకాశం కల్పించారు.