ఏపీలో వచ్చే నెల 7 నుండి ఆరోగ్య శ్రీ సేవలు(Arogyasri) బంద్ కానున్నాయి. ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ అల్టిమేటం 3500 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. తక్షణమే 1500 కోట్లు చెల్లించాలని లేదంటే సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వంకి లేఖ రాశారు.
నేటి నుండి 7 వరకు వివిధ రూపాల్లో నిరసనను తెలియచేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 7 నుండి పూర్తిగా సేవలు నిలిపివేయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. 10 నెలల్లో 26 సార్లు లేఖలు రాసిన ప్రభుత్వం పట్టించుకోలేదని నిరసనను తెలియచేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యశ్రీ సేవలు 2025, ఏప్రిల్ 7 నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయడానికి కారణాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం, బీమా ప్యాకేజీలపై అభ్యంతరాలు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే ఇన్సూరెన్స్ విధానంపై అభ్యంతరాలు, బకాయిల భారాన్ని మోయలేకపోవడం, ఆసుపత్రులను నడపలేకపోవడం.
Arogyasri: ఏపీలో వచ్చే నెల 7 నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES