ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రి చేస్తాయని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని 22వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరిందని, అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు రషీద్, పట్టణ వైసిపి అధ్యక్షులు సయ్యద్ మీర్, కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు, వాటి వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Athmakuru: సంక్షేమ పథకాలు జగన్ ను గెలిపిస్తాయి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES