చంద్రబాబు నాయుడు సభలకు వస్తున్న జన సందోహంను చూసి తట్టుకోలేని ప్రభుత్వం అక్రమ కేసులతో చంద్రబాబును ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆత్మకూరు తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణం లో భారీ స్థాయిలో బంద్ నిర్వహించామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు న్యాయవాది కంచర్ల గోవింద రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ బంద్ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంగాల శివరామ రెడ్డి,ముస్లిం మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి నాగూర్ ఖాన్,తెలుగుయువత నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి ఫ స్ఫిల్ మున్నా,బి.సి.విభాగం కార్యదర్శి ఇరగ దిండ్ల మురళి,పట్టణ అధ్యక్షుడు వేణు గోపాల్,ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా పురం భాషా,అమలాపురం శ్రీకాంత్ గౌడ్,ముస్లిం మైనారిటీ నియోజక వర్గం అధ్యక్షుడు కలిముల్లా,కార్యకర్తలు పాల్గొన్నారు.