Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Atmakuru: క్రీడా మైదానంలో అన్ని వసతులు కల్పిస్తాం: శిల్పా

Atmakuru: క్రీడా మైదానంలో అన్ని వసతులు కల్పిస్తాం: శిల్పా

ఆత్మకూరు క్రీడా మైదానంలో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్ లో ఇండోర్ స్టేడియంకి భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శిల్ప ఇండోర్ స్టేడియం ఆవరణంలో తిరుగుతూ క్రీడాకారులతో, సీనియర్ సిటిజన్ తో మాట్లాడుతూ మన ఆత్మకూరు క్రీడాకారులకు పుట్టినిల్లు లాంటిది అని భవిష్యత్తులో క్రీడా ప్రాంగణంలో అన్ని వసతులతో కల్పిస్తామని క్రీడాకారులకు భరోసా కల్పిస్తామన్నారు. క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పిటిసి సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News