Homeఆంధ్రప్రదేశ్Gym trainer: కాకినాడలో దారుణం జిమ్ ట్రైనర్ దారుణ హత్య

Gym trainer: కాకినాడలో దారుణం జిమ్ ట్రైనర్ దారుణ హత్య

కాకినాడ (తెలుగు ప్రభ): కాకినాడ భానుగుడి సెంటర్ లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం భానుగుడి సెంటర్ చార్మినార్ టీ స్టాల్ సమీపంలో అర్థరాత్రి రెండు గంటల సమయంలో కోమటి సతీష్ రెడ్డి (30) బందుల సాయికిరణ్ మహిళ విషయమై ఘర్షణ జరిగింది ఘర్షణ మరింత పెద్దది కావడంతో సాయికిరణ్ అతని స్నేహితులు కలిసి సతీష్ రెడ్డి పై విచక్షణ రహితంగా కర్రతో పొడిచి పొడిచి హత్య చేశారు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం జిజిహెచ్ లో మృతదేహాన్ని ఉంచారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలు వలన హత్య కోణంలో కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బందుల సాయికిరణ్ మరియు స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News