August holidays: ఈ ఏడాదిలో మరో నెల పూర్తయ్యింది.ఆగస్టు నెల వచ్చేసింది. గత నెలలో సాధారణ సెలవులు తప్ప అదనపు సెలవులు ఏమి లేవు.కానీ ఈ ఆగస్టు నెలలో మాత్రం పండుగలు,జాతీయ దినోత్సవాలు,ఆదివారాలు ఇలా అన్ని కలిపి దాదాపు 10 రోజులకు పైగా సెలవులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.
ఆగస్ట్ నెలకు సంబంధించి సెలవు రోజులను ఓసారి చూస్తే 31 రోజులలో కేవలం 22 రోజులే పనిదినాలు. మిగిలిన 9 రోజులు సెలవు రోజులే. రెండో తేదీ సండే. ఆగస్ట్ 8వ తేదీ రెండో శనివారం ఆగస్ట్ 9వ తేదీ ఆదివారం
ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆగస్ట్ 15న సెలవు. ఆగస్ట్ 16 ఆదివారం వచ్చింది. ఆగస్ట్ 21వ తేదీ వరలక్ష్మీ వ్రతం హాలీడే . ఆగస్ట్ 23వ తేదీ ఆదివారం.
9 రోజులు సెలవులు…
25వ తేదీ మిలాద్ ఉన్ నబి దాంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాలీడే. అలాగే ఆగస్ట్ 30వ తేదీ ఆదివారం ఉంది. మొత్తంగా ఈ నెలలో ఆదివారాలు, పండుగలు ఇలా అన్ని కలుపుకుంటే 9 రోజులు సెలవులు రానున్నాయి. ఉద్యోగులకి ఈ నెలలో రెండు ఆప్షనల్ హాలీడేస్ ఉన్నాయి. ఒకటి 4 వ తేదీన కాగా,మరొకటి 28న శుక్రవారం రాఖీ పండుగ ఇది కూడా ఆప్షనల్ హాలీడే. వాతావరణం కారణంగా అదనపు సెలవులు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.

