ఏపీలో సంచలనం సృష్టించిన ముంబై నటి జెత్వానీ(Actress Jethwani) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జెత్వానీని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారులు(IPS Officers) కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంత రావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ వెంకటేశ్వర్లుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా నిందితులు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై పలు మార్లు విచారణ జరిగింది. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయకపోవడం గమనార్హం. కాగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని జెత్వానీ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు.