Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalle: భారీ మెజార్టీతో వైసీపీ మధుసూదన్ విజయం

Banaganapalle: భారీ మెజార్టీతో వైసీపీ మధుసూదన్ విజయం

పట్టణంలోఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ ఏ మధుసూదన్ తన సమీప ప్రత్యర్థుల కంటే అత్యధిక ఓట్లతో భారీ విజయాన్ని సాధించడం పట్ల ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల ఎంపిటిసి సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాలరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 13న పోలింగ్ జరిగిన విషయం పాఠకులకు విధితమే. ఈ ఎన్నికల్లో వైకాపా మద్దుతారుగా డాక్టర్ ఏ మధుసూదన్ పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థులుగా మోహన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు.

- Advertisement -

ఎన్నికల్లో మొత్తం 1178 ఓట్ల గాను 1136 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి గురువారం కర్నూలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ మధుసూదన్ 988 ఓట్లు అధిక్యతతో గెలుపొంది ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపుపత్రాన్ని స్వికరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ గెలుపునకు విస్తృతంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ పరిధిలో ప్రచారం చేసిన ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల ఎంపిటిసి సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాలరెడ్డి మాట్లాడుతూ.. ఈ విజయం జిల్లాలోని వైసిపి ఎమ్మెల్యేల విజమని అన్నారు.

రాష్ట్రంలో మొత్తం మూడు చోట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరుగగా మూడు చోట్లా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి డాక్టర్ మధుసూదన్ అందరికంటే ఎక్కువ 988 ఓట్ల అధిక్యతతో విజయం సాధించారని అన్నారు. ఈ విషయంలో కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల కృషి, స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పిటిసి జెడ్పిటిసిల కృషి కారణమని అన్నారు.

ముఖ్యంగా బనగానపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిలు డాక్టర్ మధుసూదన్ ఎమ్మెల్సీ గెలుపుకు తమ వంతు సహకారం అందించారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News