Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: చంద్రబాబు సభకు తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు

Banaganapalli: చంద్రబాబు సభకు తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కడప నగరంలోని పుత్తా ఎస్టేట్ లో జరిగిన టీడీపీ జోన్ 5 కి సంబంధించిన క్లస్టర్ ఇంచార్జ్, యూనిట్, బూత్ ఇంచార్జ్ ల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆదేశించిన పార్టీ కార్యక్రమాల్ని ప్రజలలోకి చురుకుగా తీసుకవెళ్లిన ముగ్గురు క్లస్టర్ ను కొలిమిగుండ్ల మండలం క్లస్టర్ ఇంచార్జ్ కృష్ణ రంగారెడ్డిని, కోయిలకుంట్ల మండలం క్లస్టర్ ఇంచార్జ్ రవీంద్రనాథ్ రెడ్డిని సంజామల మండలం క్లస్టర్ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డిని చంద్రబాబు నాయుడు అభినందించి, భవిష్యత్లో మరింత ఉన్నతంగా పార్టీ కార్యక్రమాల్ని ప్రజలలోకి చురుకుగా తీసుక వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమం లో క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News