Sunday, April 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: కాటసాని సోదరులకి మాతృవియోగం

Banaganapalli: కాటసాని సోదరులకి మాతృవియోగం

ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన త‌ల్లి పుల్లమ్మ (90) అనారోగ్య కారణంగా కర్నూలులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. వయసు ఎక్కువ కావడంతో కోలుకోలేకపోయారు. గ‌త‌ రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో మృతి చెందారు. ఆమె మృతితో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కుమారుడు కాటసాని ఓబులరెడ్డిలు శోకసంద్రంలో మునిగిపోయారు. పుల్లమ్మ మృతదేహాన్ని బుధవారం ఉదయం కర్నూలు నుంచి నేరుగా తమ స్వగ్రామమైన అవుకు మండలం గుండ్లసింగవరం తీసుకవెళ్లి, అక్కడే సాయంత్రం 5 గంటలకు దహన సంస్కారాలు చేశారు. అంత్యక్రియల్లో స్మశాన వాటిక వరకు పాణ్యం, బనగానపల్లె ఎమ్మెల్యేలు కాటసాని రామభూపాలరెడ్డి, కాటసాని రామిరెడ్డిలు పాడె మోసి మోసారు. అంతకు ముందు ఆమె మృతదేహాన్ని గుండ్లసింగవరంలోని కాటసాని రామిరెడ్డి ఇంటి ముందు ప్రజల సందర్శనార్థం ఉంచారు.

- Advertisement -

పెద్ద సంఖ్యలో కాటసాని అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు గుండ్లసింగవరం వచ్చి ఎమ్మెల్యే కాటసానికి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News