Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: టీడీపీని వీడి వైసీపీలోకి 20 కుటుంబాలు

Banaganapalli: టీడీపీని వీడి వైసీపీలోకి 20 కుటుంబాలు

బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం కమ్మవారిపల్లె గ్రామపంచాయతీ మజార గ్రామమైన లక్షుంపల్లె గ్రామంలో 20 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో టిడిపి పార్టీకి చెందిన గంగమ్మ గారి శ్రీను, గమ్మగారి కిట్టు , గంగమ్మ గారి రవి, గంగమ్మ గారి పవన్, గంగమ్మ గారి సుదర్శన్, గంగమ్మ గారి సుధాకర్, గంగమ్మ గారి వంశీధర్, బాలసుబ్బన్న గారి చిన్న కొండయ్య, పూజారి ప్రసాద్, పూజారి శ్రీను, ఎద్దుల పెద్ద కొండయ్య, దాసిగారి శ్రీనివాసులు, బుజ్జన్న గారి సురేష్, పొన్నం పల్లె వెంకటేశు, శీనన్న గారి వెంకటేశులు, బాలసుబ్రమణ్యం గారి వినయ్, గంగమ్మ గారి వెంకటేశు, పూజారి గంగాధర్, వెంకటపతి గారి మధుసూదన్, తలారి వెంకట నాయుడు, నర్సారెడ్డి గారి కిట్టు, తదితరులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైయస్సార్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కమ్మవారిపల్లె గ్రామపంచాయతీ పరిధిలోగల కమ్మవారిపల్లె, లక్షుం పల్లె గ్రామానికి చెందిన కేవలం ఐదు కుటుంబాలు మాత్రమే వైయస్సార్ పార్టీని వీడి టిడిపి పార్టీలో చేరడం జరిగిందని అయితే తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో భూ పంపిణీలో లబ్ధి పొందిన నాయకులు నేడు వైఎస్ఆర్ పార్టీని విడి టిడిపి పార్టీలో చేరడం వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని చెప్పారు. వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక పనులు చేయించుకున్న వారు నేడు కేవలం ఐదు కుటుంబాలు మాత్రమే టిడిపి పార్టీలో చేరితే వారికి వ్యతిరేకంగా 20 కుటుంబాలు నేడు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. కొంతమంది వైఎస్ఆర్ పార్టీని వీడి టిడిపి పార్టీలో చేరడంతో తమ వైయస్సార్ పార్టీలో దరిద్రం వెళ్లిపోయిందని కొలిమిగుండ్ల ప్రాంత ప్రజలే చర్చించుకోవడం జరుగుతుందని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీలో చేరిన వారందరికీ తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వారికి ఏ అవసరం వచ్చినా కూడా తాను అండగా ఉంటానని చెప్పారు. అధికారం చేపట్టిన తర్వాత పార్టీలకు కులాలకు అతీతంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని దానికి ఆకర్షితులైన లక్షుంపల్లె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టిడిపి పార్టీని వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. 2024వ సంవత్సరంలో మళ్లీ మన ముఖ్యమంత్రిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటేనే అర్హులైన ప్రతి పేదవానికి ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుందని అలాంటివారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ అంబటి గురివి రెడ్డి, కమ్మవారిపల్లి గ్రామ సర్పంచ్ కొండయ్య, వైయస్సార్ పార్టీ నాయకులు అల్లు నాగేశ్వరరావు, ములకల రామ్మోహన్, పోతూరి రంగయ్య, తమ్మినేని బాలయ్య, గంగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గంగిరెడ్డి రామేశ్వర్ రెడ్డి లతోపాటు వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News