Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: టీచర్లను భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమాలే

Banaganapalli: టీచర్లను భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమాలే

బనగానపల్లెలో (FAPTO) ఫ్యాప్తో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాలలో, ఎస్ఎస్సి స్పాట్ కేంద్రాల్లోనూ నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాల జిల్లా బనగానపల్లె తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు నంద్యాల జిల్లా ఫ్యాప్టో చైర్మన్ బి.మాధవ స్వామి అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో మాధవ స్వామి మాట్లాడుతూ 1. పాఠశాలలు ఆలస్యంగా తెరవడం 2.పాఠశాలలకు పుస్తకాలు మూడు విడతలుగా దాదాపు నాలుగు నెలలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం .3. జగనన్న విద్యా కానుక కిట్లు లేటుగా రావడం ,4. పిల్లలకు కొన్ని బూట్లు సరిపోకపోవడం.5. ప్రాథమిక పాఠశాలలో చాలా పాఠశాలలు ఏకోపాధ్య పాఠశాలలో ఉండడం 6. ఉన్నత పాఠశాలలో 80 ,100 మంది విద్యార్థులు ఒక్కొక్క సెక్షన్లో ఉండటం.7. ఉపాధ్యాయుల కొరత వేదించడం 8. ఉపాధ్యాయులకు అనేక బోధ నేతర పనులు అప్పజెప్పడం 9. అనేక పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ లేకపోవడం10. మనబడి నాడు నేడు వంటి పనులు అప్పజెప్పడం తదితర లోప భూ ఇష్టమైన అంశాలు ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు డి ఏ లు అడుగుతున్నారని పిఆర్సి అరియర్స్, ఫి ఎఫ్ లోన్ అడుగుతున్నారని తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తే ఉద్యమాలు ఎగిసి పడతాయని హెచ్చరించారు. యూటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు సత్యప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు యూనిఫామ్ వేసుకొని రాకపోయినా విద్యార్థులు నోట్ బుక్ మర్చిపోయిన బూట్లు తీసుకోకపోయినా ఉపాధ్యాయులను తప్పు పట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.

- Advertisement -

ఏపీటీఎఫ్ నాయకులు హరినాధ గౌడ్ మాట్లాడుతూ ఇంటిదగ్గర పిల్లలు ఇంటి పని చేయకపోతే ఉపాధ్యాయులపై చర్య తీసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఏపీటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ఎం మధుసూదన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు బూట్లు వేసుకొని రాకపోతే, స్కూల్ డ్రెస్ వేసుకొని రాకపోతే ఆఉపాధ్యాయులు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతూ విద్యార్థులను మెరుగైన విద్యను అందించుటకు కృషి చేస్తూ ఉన్నారని తెలిపారు. . ఉపాధ్యాయుల పైన ఇలానే కక్ష సాధింపు చర్యలు చేపడితే మునుముందు అనేక నిరసన కార్యక్రమాలు చేయడానికి వెనకాడ బోమని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో బాధ్యులు ఉపాధ్యాయులు, లింగమయ్య, హరి, ప్రతాప్, సుంకన్న, వి. సుబ్బరాయుడు,రమేష్, ఏవీఎస్ శర్మ,మద్దయ్య, విజయ్ కుమార్ హిదయతుల్లా శ్రీనివాసులు, లక్ష్మణ్ నాయక్, శేఖర్, సురేష్, ఆగస్తిన్, ఉపాధ్యాయినీలు మంజుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News