బనగానపల్లె మండలంలో సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో వాలంటీర్ల సేవలు అమోఘం అని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గుండం శేషి రెడ్డి అన్నారు. బనగానపల్లె మండలంలోని పలుకూరు గ్రామ సచివాలయంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండంశేషి రెడ్డి సేవా మిత్ర పురస్కారంకు ఎంపికైన వాలంటరీలను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి ప్రజల ఇంటి దగ్గరికి వెళ్లి వాలంటీర్లు బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నారని వారు ఎంతగానో కృషి చేస్తున్నారని, వారి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డులను ప్రధానం చేయడం జరిగిందని వజ్ర, రత్న అవార్డుల కోసం మన వాలంటీర్లు సాధించుకునేటట్లు కృషి చేయాలని గుండం శేషి రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు, సర్పంచ్ కోనేటి సుమలత, వైస్ సర్పంచ్ కే .శివకృష్ణ, వైఎస్ఆర్సిపి నాయకులు ఎంపీటీసీ వెంకటేశ్వర్లు యాదవ్, జాను, సచివాలయ కన్వీనర్ వడ్డే వెంకటేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
