Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Banagapalli: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు

Banagapalli: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు

అఖండ మెజారిటీతో జగన్ ను సీఎం చేయండి-కాటసాని

బనగానపల్లె ఆగస్టు 1 పట్టణంలోని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు పాత్రికేయుల సమావేశంలో నిర్వహించడం జరిగింది. పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ తనగానపల్లె నియోజకవర్గంలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమంలో గత నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించి నెలరోజుల పాటు బనగానపల్లె నియోజకవర్గం లోని 82 గ్రామ సచివాలయాల్లో జగన్ అన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనుహ్యా స్పందన లభించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,083 వేల గ్రామ సచివాలయాల పరిధిలో 1 కోటి 29 లక్షల 34,042 వేల కుటుంబాలను కలిసి 84 లక్షల 13,697 సర్టిఫికెట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గం లోని 82 గ్రామ సచివాలయాలోని 1,610 మంది గ్రామ వాలంటీర్లు 91వేల 965 కుటుంబాలను కలిసి 48 వేల 953 సర్టిఫికెట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. నంద్యాల జిల్లాలోనే బనగానపల్లె మండలం 21,293 సర్టిఫికెట్లను మంజూరు చేసి జిల్లాలోని మొదటి స్థానంలో, అలాగే జిల్లాలోనే అత్యధికంగా సర్టిఫికెట్లు మంజూరు చేసిన గ్రామ సచివాలయం బనగానపల్లె మండలంలోని ఇల్లూరు కొత్తపేట గ్రామ సచివాలయం 2,099 సర్టిఫికెట్లను మంజూరు చేసి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవానికి నవరత్నాలు అందాలనేదే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయం అని సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి కూడా వారికి ధ్రువీకరణ పత్రాలు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను పరిగణలోకి తీసుకొని ఎలాగైనా వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలని లక్ష్యంతోనే జగనన్న సురక్ష కార్యక్రమం నెలరోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. జగనన్న అందిస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం జరుగుతుందని మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ ఫలాలు గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించడానికి వారి ప్రతినిధులు రావడం జరుగుతుందని చెప్పారు. జగనన్న అందిస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు 2 లక్షల 25,000 వేల కోట్ల రూపాయలు నేరుగా అర్హులైన ప్రతి పేదవానికి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని ఎక్కడ కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకి అందించడం జరిగిందని చెప్పారు. ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి అందిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం సంక్షేమ ఫలాలు అందించడం లేదని చెప్పుకోవడం వారి విజ్ఞతకే వదిలివేయడం జరిగిందని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గంలోనే టిడిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు లక్షలాది రూపాయలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు లబ్ధి చేకూరడం జరిగిందని తాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో నేరుగా తానే టిడిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు బుక్ లేట్ అందించడం జరిగిందని చెప్పారు. ఇన్ని సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవాలని కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు లబ్ధి చేకూరాలంటే ఆయనను 175 కి 175 స్థానాల్లో శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, యాగంటి స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు డాక్టర్ మహ్మద్ హుస్సేన్, అత్తార్ జాహీద్ హుస్సేన్, బనగానపల్లె నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సాధుల శివశంకర్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కోడూరు రామచంద్రారెడ్డి, వార్డు మెంబర్ కుమ్మరి సురేష్,జస్వంత్ రెడ్డి, కాంట్రాక్టర్ కమ్మగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News