Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bandi Athmakuru: సాగునీరు ఇచ్చి అన్నదాతను ఆదుకోవాలని రైతు సంఘాల రాస్తారోకో

Bandi Athmakuru: సాగునీరు ఇచ్చి అన్నదాతను ఆదుకోవాలని రైతు సంఘాల రాస్తారోకో

బండిఆత్మకూరు మండలంలోని తెలుగుగంగ ఆయుకట్టు కింద ఉన్న అనేక గ్రామాలలో వరి పంట విస్తారంగా వేశారు. వేల రూపాయలు ఖర్చు చేసి కంకి పాలదశకు చేరుకొని ఉండగా నీటి పారుదల శాఖ అధికారులు ఈనెల 18 వరకు నీరు ఇస్తామని చెప్పడంతో పంట చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోతే పొలాలు ఎండిపోయి రైతుకు అపార నష్టం జరుగుతోంది. దీంతో మే 15 వరకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం మండల కమిటీ నాయకులు సాగునీరు ఇచ్చి అన్నదాతను ఆదుకోవాలని రాస్తారోకో నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ జిల్లా నాయకుడు తలారి రామచంద్రుడు మాట్లాడుతూ అధికారులు ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో కొన్నివేల టిఎంసిల నీరు సముద్రం పాలై వేసవిలో తెలుగుగంగ కింద ఉన్న గ్రామాలకు సాగునీరు, త్రాగునీరుకు అవాంతరాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మే చివరి నాటికి ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంచాలని రైతు సంఘాలు అనేకసార్లు డిమాండ్ చేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం దారుణమన్నారు. ప్రజా సంఘాల నాయకులు డేవిడ్ రత్నమయ్య సుబ్బరాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవి మాట్లాడుతూ పంట చేతికొచ్చే దశలో నీరు లేక పంటలు ఎండిపోతాయని మనోవేదనకు గురైన రైతులను స్థానిక ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి మే 15 వరకు సాగునీరు అందిస్తామని భరోసా ఇవ్వాలన్నారు. అలా కాని పక్షంలో అన్నదాతలతో ఎస్ఈ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామాపురం సింగవరం జి సి పాలెం కడమల కాలువ గ్రామాల రైతులు రాముడు, మహేష్, సుబ్బరాయుడు, శేఖర్ ప్రజా సంఘాల నాయకులు డివైఎఫ్ఐ జిల్లా నాయకుడు రాజేష్, జాను, దానమయ్య సిఐటియు మండల నాయకుడు రాజు రైతులు వెంకట్రాముడు, ఏంజెల్ పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News