బండిఆత్మకూరు గ్రామపంచాయతిలోని ఎరుకల కాలనీలో ఎంపీడీఓ వాసుదేవ గుప్తా అధ్వర్యంలో శ్రీశైల నియోజకవర్గం శాసనభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి 105 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులకు కరపత్రాలను పంపిణీ చేసి కాలనీలో గడప గడపకు తిరుగుతూ ప్రజలు సమస్యను అక్కడే పరిష్కరించారు.
చంద్రబాబు హయాంలో ఇలాంటి పథకాలే లేవని ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాని గడపకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేసి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా ప్రతి గ్రామంలో వాలింటరీ వ్యవస్థ, సచివాలయాలు ఏర్పాటు చేసి సమస్యలు అక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను వాలింటరీలు గడప గడపకు తిరిగి అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే వ్యవస్థ తెచ్చాడని తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న వైయస్సార్ ప్రభుత్వానికి అండగానిలసి మళ్ళీ జగనన్నను సీఎంగా, నన్ను ఎమ్మెల్యేగా ఆదరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయ కర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి ,ఎంపీపీ దేరెడ్డి సంజీవరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ముడిమెల పుల్లారెడ్డి,
సింగిల్ విండో చైర్మన్ భూరం శివలింగం, మార్కెట్ యార్డు డైరెక్టర్ విక్రంసింహా నాయక్ ,మాజీ సింగిల్ విండో చైర్మన్ బాబు రెడ్డి, సర్పంచ్ ఎరుకల సంధ్య, వైస్ సర్పంచ్ ఆవుటాల నాగేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజం రెడ్డి సుజాతమ్మ, రాజారెడ్డి,ఎరుకల సుంకన్న,వివిధ శాఖల మండలస్థాయిఅధికారులు, వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
