Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Best PS: దేశంలో 'బెస్ట్ పోలీస్ స్టేషన్' గా హనుమంతునిపాడు

Best PS: దేశంలో ‘బెస్ట్ పోలీస్ స్టేషన్’ గా హనుమంతునిపాడు

కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా ఇచ్చే అవార్డు

రాష్ట్రంలోని హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ను ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా దేశంలోని ప్రజలకు అత్యుత్తమమైన, ప్రజలకు మెరుగైన సేవలనందించే పోలీస్‌ స్టేషన్లను వివిధ అంశలలో గుర్తించి, వాటిని అత్యుత్తమ ‘పోలీస్‌ స్టేషన్లు’గా ప్రకటించి ప్రశంసిస్తున్నది. అందులో భాగంగా 2022 సంవత్సరానికి గాను ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ను ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ అందించిన సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ ను జిల్లా ఎస్పీ ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ మరియు హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై కృష్ణ పావని, సిబ్బందిని అభినందించిన DGP కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి.

- Advertisement -

ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపికకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగనంలోకి తీసుకున్న అంశలు;

  1. నేరాల నియంత్రణ,
  2. లా అండ్ ఆర్డర్ మెయింటేనన్స్,
  3. చట్టాల అమలు,
  4. కేసుల దర్యాప్తు మరియు విశ్లేషణ,
  5. కోర్టు సమన్లు, కోర్టు మానిటరింగ్,
  6. ప్రోయాక్టివ్ పోలీసింగ్,
  7. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్,
  8. పెట్రోలింగ్ నిర్వహణ
  9. పచ్చదనం & పరిశుభ్రత మొదలైన అన్ని విభాగాల్లో స్థానిక ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ను ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రి మరియు కేంద్ర హోమ్ సెక్రటరీ సంతకంతో కూడిన సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ ను అందిస్తారు.

నగదు బహుమతి: జిల్లా ఎస్పీ కి 25,000 మరియు ఎసై కి 10,000 రూపాయల నగదు బహుమతిగా డి‌జి‌పి అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News