బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం గ్రామ బస్ స్టాండ్ దగ్గర రోడ్డుపై రైతులు ఎడ్ల బండ్లతో ట్రాఫిక్ ను ఆపి ధర్నా చేపట్టారు. రోడ్ సైడ్ వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు కూడా స్వచ్చందంగా ధర్నాలో పాల్గొన్నారు.
గ్రామంలో రెండు నెలల నుండి మంచినీరు పైపులైన్ ద్వారా నీరు రావటం లేదు. రోడ్ వెడల్పు పనులలో భాగంగా నీరు ప్రజలకు అందుటం లేదంటూ ధర్నా చేపట్టారు. డోన్ హైవే దగ్గర నుండి చిన్న మల్కాపురం, ఆర్ఎస్. రంగాపురం, బేతంచెర్ల పట్టణ శివారు నుండి సోమయాజుల పల్లె ( ఓర్వకల్ మం ) వరకు, రెండు హైవేల మధ్య, నేషనల్ హైవే రోడ్ నిర్మాణం కొరకు, వందల కోట్ల రూపాయల వ్యయంతో, మాజీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రత్యేక కృషితో, ప్రత్యేక చొరవవల్ల ఈనేషనల్ హైవే రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా రంగాపురంలో రోడ్డు వెడల్పు పనులు జరుగు తున్నందువల్ల పైపులైన్ కట్ చేశారు. పైపు లైన్ ద్వారా ప్రజలకు మంచినీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, రైతులు ఎడ్ల బండ్లతో ధర్నాకు పూనుకోవడమైనది.
ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్. రంగాపురం గ్రామ సర్పంచ్ జి. రాజు, గ్రామ కార్యదర్శి కలిసి యుద్ధ ప్రాతిపదికన పైపు లైన్ పనులు చేపడతామని రైతులకు ప్రజలకు నచ్చ జెప్పారు. బేతంచెర్ల పోలీసువారు అక్కడికి చేరుకొని ఆగిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.