గోరుకల్లు రిజర్వాయర్ నీటి దగ్గర మంగళవారం గంగమ్మకు సర్వమత ప్రార్థనలు నిర్వహించి, 351 కోట్ల రూపాయలతో, డోన్ నియోజక వర్గ ప్రజలందరికీ మంచినీరు అందించుటకై నిర్మించిన, నీటి సప్లై పంప్ హౌస్ లోని మీటర్ ను వైసిపి ముఖ్య నాయకులు పిట్టల జాకీర్ హుసేన్ తదితరులు మీటర్ నొక్కి స్టార్ట్ చేశారు.
అనంతరం బేతంచెర్ల నగర పంచాయితీ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో, బేతంచెర్ల పట్టణం పోలీస్ కాంప్లెక్స్ దగ్గరి నుండి సాయిధరణి టౌన్ షిప్ లో నిర్మించిన గ్రౌండ్ వాటర్ ట్యాంక్ దగ్గరికి, మంగళ వాయిధ్యాలతో, మహిళలు భారీ ఎత్తున కా య కార్పుర, నీటి కలశాలతో కదలివచ్చారు. గ్రౌండ్ ట్యాంక్ దగ్గర వేద పండితుల మంత్రోచ్చరణములతో,బేతంచెర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయితీ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ పూజలు చేశారు.
భక్తి శ్రద్దలతో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గోరుకల్లు కృష్ణమ్మ నుండి బేతంచెర్లకు మంచినీళ్లు వచ్చే బృహత్తర మంచి నీటి పథకానికి ఆమోదం ముఖ్యమంత్రి వైవైస్ జగన్ మోహన్ రెడ్డికి, ఎంతో వ్యయ ప్రయాసల కోర్చుకొని, డోన్ నియోజక ప్రజల దాహార్థిని తీర్చబోవుతున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి నియోజక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని వీరికి ప్రజలు కృతజ్ఞతాభి వందనములు తెలిపారు.
ఈ కార్యక్రమంలోశ్రీ మద్దిలేటి స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సీతారామచంద్రుడు, వైసిపి నాయకులు, వార్డు కౌన్సిలర్లు, నగర పంచాయితి సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు.