బేతంచెర్ల బాలుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ధార్మికవేత్త గుండాగోపాల్ మనుమడు.. గుండా అభిరామ్-గుండా అక్షర తనయుడు, గుండా రాఘవేంద్ర అయన్ 4 వతరగతి చదువుతూ తన ప్రతిభతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. చిన్నవయసులోనే ఈ రికార్డ్ సొంతం చేసుకోవడం ఆసక్తిగొలుపుతోంది. 300 నుంచి 1 వరకు వెనుక నుంచి అతివేగంగా కేవలం 37 సెకండ్లలో పూర్తిచేసి ఇండియన్ బుక్ రికార్డ్స్ లో చోటు పొందటం కుటుంబ బంధు మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ బాలుడిని అభిందించారు. పిల్లలకు చదువుల మీద తల్లిదండ్రులు మంచి జాగ్రత్తలు తీసుకుంటే, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారని గుండా గోపాల్ అన్నారు.
Bethamcharla: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుండా రాఘవేంద్ర
బేతంచర్ల బాలుడి ఘనత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES