Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: ప్రచారంలో దూసుకుపోతున్న కోట్ల చిత్ర

Bethamcharla: ప్రచారంలో దూసుకుపోతున్న కోట్ల చిత్ర

తన తండ్రిని గెలిపించమని ప్రచారం..

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం బేతంచెర్ల మండలం హెచ్ కొట్టాల గ్రామంలో, డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తనయ, కోట్ల చిత్రమ్మ హెచ్ కొటాల గ్రామ ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు, మన అందరి కోసం ప్రవేశ పెట్టారని అన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ అవకాశాలు, నెరవేర్చేటటు వంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే అని అన్నారు. అందుకొరకై రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పోవాలని, తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రజలను కోరారు. అందులో భాగంగా డోన్ నియోజవర్గానికి మంచి పరిపాలన అందించుటకు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి కి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బుగ్గన మాధవిరెడ్డి, బాబు, నందీశ్వరుడు, మండల, గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News