Saturday, July 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: బుగ్గన రాష్ట్రానికి మంత్రా లేక బేతంచర్లకు మాత్రమేనా?: కోట్ల

Bethamcharla: బుగ్గన రాష్ట్రానికి మంత్రా లేక బేతంచర్లకు మాత్రమేనా?: కోట్ల

రైతు రాజ్యం తెస్తాం

బేతంచెర్ల మండలం వెంకటగిరి, మర్రికుంట, పెండేకల్, రేపల్లె, గ్రామాలలో మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య , పట్టణ టిడిపి అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మీ అధ్యక్షతన బాబు – షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్ర రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం రాష్ట్రంలో దాపురించిందని, రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు వలస కూలీలుగా మారి ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనం కొనసాగించగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

- Advertisement -

నేను రైతుబిడ్డగా చెబుతున్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన వెంటనే రాష్ట్రంలో రైతు రాజ్యం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. నువ్వు రాష్ట్రానికి మంత్రివా.. లేక డోన్ కు మాత్రమే మంత్రివా అని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి , డోన్ నియోజకవర్గంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడి, గత పాలకులు వేసిన రోడ్ల పైనే రోడ్లు వేసి, కమీషన్లు దండు కోవడం నీ నైజం అని కోట్ల నిప్పులుచెరిగారు. డోన్ నియోజకవర్గం రైతులు పూర్తిగా వర్షంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు, సరైన వర్షాలు లేక పంటలు పండలేదు మరి మీకు మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడానికి కూడా మనసు రాలేదంటే, నీకు రైతుల పాలిట ఏ రకమైన ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. కేవలం బేతంచెర్ల మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించి మిగిలిన మండలాలపై మీరు సవతి ప్రేమ చూపిస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది అని అన్నారు.


దేశంలో రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి సిద్ధాంతం నాది , రైతులు ఏమైపోయినా పర్వాలేదు నా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని సిద్ధాంతం బుగ్గనది , రైతులందరూ ఆలోచించి రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెండేకల్లు గ్రామ పంచాయతీ రైతులతో మాట్లాడుతూ రైతులకు ఉచిత బోర్లు వేయించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.


స్థానిక టిడిపి నాయకులు పెద్ద వెంకటేశ్వర్లు, రాజగోపాల్ రెడ్డి, గొల్ల సుబ్బయ్య, ఈరన్న, తిరుమలేష్ రెడ్డి, ధోని రామాంజనేయులు, అయ్య స్వామి, సత్యం, సుబ్బారెడ్డి, ఎల్ల స్వామి, నారాయణరెడ్డి, మోహన్ రెడ్డి ,నగేష్, రామ తిమ్మయ్య, మౌలాలి, బాల రంగడు, శివ నారాయణ, బజారు పెద్దమధస్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News