బేతంచెర్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బిసి డిక్లరేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల జీవితాలలో మార్పు తెచ్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కుమ్మరి, కమ్మరి, రజకులు, వడ్డెర, బోయ వాల్మీకుల, మరియు బీసీలుగా ఉన్న ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు చేయూతనిస్తూ, ఆదరణ పథకం తీసుకువచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే, బీసీలకు రాజ్యాధికారం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ అన్ని రంగాలలో ముందుండాలన్న ఉద్దేశంతో, నాడు తెలుగుదేశం పార్టీ సబ్సిడీ రుణాలు ఇచ్చిందన్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో పేరుకు మాత్రమే 56 బీసీ కార్పొరేషన్లు కానీ కార్పొరేషన్లలో నిధులు మాత్రం శూన్యం అన్నారు.
రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే, రానున్న ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలందరూ ఏకతాటి పైకి వచ్చి, సైకో జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ , బిసి సబ్ ప్లాన్ కింద లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య, పట్టణ టిడిపి అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి, టిడిపి సీనియర్ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు భీమేష్ రెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, కౌన్సిలర్ పూజారి రామాంజనేయులు, నియోజకవర్గ వాల్మీకి సాధికార కన్వీనర్ టైలర్ రాముడు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి రవీంద్ర నాయక్, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యదర్శి నాగరాజు జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రూబిన్, నియోజకవర్గ వాణిజ్య అధ్యక్షుడు రేగాటి భీమారెడ్డి జనసేన నాయకులు నాగరాజు, చల్ల మద్దిలేటి స్వామి, శ్రీ కంటి మధు, మధు లోకేశ్వర్ రెడ్డి, జక్రియ, పుట్టపాశం వెంకటేశ్వర్లు, పాపసాని కొట్టాల వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, సుభాని, మోహన్ గౌడ్, నాయిని రామకృష్ణ, విజయ్, రామకృష్ణ, సూరి, అంజద్ భాష, కానాల అంజి, శ్రీపతి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.