బేతంచెర్ల మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామానికి చెందిన 100 మంది టీడీపీని వీడి వైసిపి లోకి చేరారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా వైసిపి కండువా వేసుకొని పార్టీలోకి చేరడం జరిగింది. అలాగే మంగళవారం పొద్దుపోయిన తర్వాత బేతంచెర్ల పట్టణం దుర్గాపేటకు చెందిన 120 మంది టీడీపీ నాయకులు, మహిళలు టీడీపీని వీడి బుగ్గన సమక్షంలో వైసిపిలో చేరారు.
ఈ సందర్బంగా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వైసిపి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపిలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల, మత, ప్రాంతం అనే భేదం లేకుండా రాష్ట్ర ప్రజలకు చేసిన అభివృద్ధిని కళ్ళారా చూశామని, అలాగే మంచి నీరు దొరకని బేతంచెర్ల మండలంతో పాటు డోన్, ప్యాపిలి మండలాల ప్రజలకు రక్షిత మంచి నీటి పథకం ద్వారా శాశ్వతంగా మంచినీరు అందిస్తున్నారన్నారు. మంత్రి బుగ్గన డోన్ నియోజక వర్గ ప్రజలకు అపర భగీరతుడయ్యారని, డోన్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయుటలోమంత్రి బుగ్గనకు మరెవ్వరూ సాటి కారు, కాలేరని, పూర్తిగా తెలుసుకొని, టీడీపీ వీడి వైసిపిలో చేరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయితి చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ బాబు రెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు బుగ్గన చంద్రా రెడ్డి, గొర్ల గుట్ట ఇన్చార్జి సిహెచ్ లక్ష్మిరెడ్డి గోర్లగుట్ట గ్రామ పెద్దలు బి చలపతి రెడ్డి, బి వెంకరెడ్డి, సంగు జయరామిరెడ్డి, మాధవ ఆచారి,కూరగాయల లోకేష్, నెంబర్ ఓలా మద్దయ్య, బాలస్వామి, కొట్టాల భూషణం, బట్టి,కటిక వాణికుంటశేషు, కటికవానికుంట నాగరాజు, దూదేకుల ఖా, రాజేశ్వరి, రమాదేవి, వరాలు, మద్దిలేటి,మద్దిలే టమ్మమెట్టుపల్లి చంద్ర, జైరెడ్డి బుడిగి నాగరాజు, దుర్గా పేట వాసులు మంటి మల్లిఖార్జున,జె. మధు,గజ్జి లచ్చమ్మ,జి. నాగన్న,ఎస్ రాజకుమార్,నత్తి చంద్ర, నత్తి చిన్న,ఎన్.హరికృష్ణ,క్రాంతికుమార్, నాగేంద్ర ప్రసాద్ జి. మద్దయ్య, కె మద్దయ్య శ్రీనివాసులు,కొత్తపల్లె లక్ష్మీదేవి శంకరమ్మలతో పాటు,వైసిపి నాయకులు జి మురళి, చిన్న ఎద్దులన్న కోడె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.