Homeఆంధ్రప్రదేశ్Bethamcherla: వందేళ్ల చరిత్ర కలిగిన నగర పంచాయతీ పీఠం ఎవరికి..??

Bethamcherla: వందేళ్ల చరిత్ర కలిగిన నగర పంచాయతీ పీఠం ఎవరికి..??

బీసీ రిజర్వేషన్ కావడంతో స్థానిక ఎన్నికల నేపథ్యంలో హాట్ పాలిటిక్స్

- Advertisement -

బేతంచెర్ల, (తెలుగు ప్రభ):నంద్యాల జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బేతంచెర్ల నగర పంచాయతీ పీఠం వంద సంవత్సరాల తర్వాత బీసీకి రిజర్వేషన్ కావడంతో రాజకీయ వేడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతుండటంతో ఆ పీఠం ఎవరిని వరించబోతుందన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది.

బేతంచెర్ల నగర పంచాయతీకి బ్రిటీష్ కాలం నాటి వందేళ్ల చరిత్ర ఉంది. ఈ వందేళ్ల కాలంలో ఎంతో మంది ప్రముఖులు ఈ పీఠాన్ని అధిరోహించారు. ఎన్నో రాజకీయ మలుపులకు, అభివృద్ధి నిర్ణయాలకు ఈ పీఠం సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావడంతో మరోసారి ఆ చారిత్రాత్మక పీఠం ఎన్నికల బరిలోకి వస్తోంది. దీంతో ఆ పీఠాన్ని వరించబోయేది ఎవరన్న చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది.

పార్టీల వ్యూహాలు:

ఒకవైపు అధికార కూటమి, మరోవైపు ప్రతిపక్షాలు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుంటుంటే, ప్రతిపక్షాలు తాము చేసిన అభివృద్ధిని, ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ పావులు కదుపుతున్నాయి.

వార్డుల వారీగా సమీకరణాలు ఇప్పటికే మొదలయ్యాయి. కుల, వర్గ సమీకరణాలు, అభివృద్ధి నినాదంతో నాయకులు ముందుకు వెళ్తున్నారు. ప్రతి వార్డులో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ జరుగుతోంది. టికెట్ల కోసం ఆశావహులు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఓటర్లు కీలకం:

ఈసారి నగర పంచాయతీ పరిధిలో వార్డుల సంఖ్య 20 నుంచి 28కి పెరిగింది. మొత్తం 28 వార్డులకు గాను మొత్తం ఓటర్లు 31,285 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 16,143 మంది, పురుషులు 15,126 మంది ఉన్నారు. కులాల వారీగా చూస్తే బీసీ ఓటర్లు 19,283 మంది, ఎస్సీలు 4,443 మంది, ఎస్టీలు 301 మంది, ఇతరులు 7,258 మంది ఉన్నారు.
ఈసారి ఎన్నికల్లో యువత, మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. యువ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనేది ఫలితాలను ప్రభావితం చేయనుంది.

ప్రధాన అజెండా:

ప్రతిపక్షమైన వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం గురించి పట్టణంలోని ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, వంటి అంశాలు ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారబోతున్నాయి.అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరంతరం ప్రజల పనిమధ్యన ఉంటూపని చేస్తు, అభివృద్ధి చేస్తున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి వందేళ్ల తర్వాత బీసీకి రిజర్వ్ అయిన ఈ చారిత్రాత్మక పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? కొత్త ముఖమా? పాత అనుభవమా? అన్నది తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే..??

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News