Homeఆంధ్రప్రదేశ్Encroachment : బేతంచెర్లలో లేఔట్ల మాయాజాలం.. గౌరీపేటలో మురుగు ముప్పు

Encroachment : బేతంచెర్లలో లేఔట్ల మాయాజాలం.. గౌరీపేటలో మురుగు ముప్పు

బేతంచెర్ల ( తెలుగు ప్రభ ) :  రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాసులు సంపాదించే కక్కుర్తితో నైతికతను అటకెక్కిస్తే సామాన్యుల బతుకులు ఎలా చిత్తవుతాయో చెప్పేందుకు బేతంచెర్లలోని గౌరీపేట దుస్థితే నిదర్శనం. నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కి, తరతరాలుగా నీటిని తరలించే సహజ వనరులను కబళిస్తుంటే నిఘా ఉంచాల్సిన యంత్రాంగం ఏం చేస్తోంది? పట్టణానికి రక్షగా నిలిచిన చారిత్రక ‘కందకం’ మురికికాలువను కుంచించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ అదృశ్య శక్తులెవరు?

- Advertisement -

నిబంధనలకు పాతర.. నాడు అనుమతులు: గౌరీపేట సమీపంలోని సర్వే నెం. 439-బి లోని 7 ఎకరాల 31 సెంట్ల భూమిలో 1994లో ‘ఎల్పీ నెం.432/94’ పేరిట గ్రామపంచాయతీ ద్వారా రియల్టర్లు లేఔట్ అనుమతులు పొందారు. బేతంచెర్ల పట్టణ మురుగునీటిలో దాదాపు సగభాగం ఊరి వెలుపలికి వెళ్లేందుకు పూర్వీకుల కాలంలోనే 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతుతో పటిష్టమైన కందకం (కాలువ) ఉండేది.

లాభాల వేటలో శాపగ్రస్తమైన గౌరీపేట: లేఔట్ విస్తరణ ముసుగులో కొందరు వ్యాపారులు ఆ కందకపు భూమిని ఆక్రమించడమే కాక, పది అడుగుల కాలువ స్థానంలో కేవలం రెండు అడుగుల చిన్న కాల్వను ఏర్పాటు చేశారు. పైగా దానిని ప్రధాన ప్రవాహ మట్టం కన్నా ఎత్తుగా నిర్మించడంతో మురుగునీరు సాఫీగా సాగక వెనక్కి తన్నుతోంది. ఫలితంగా చిరుజల్లు పడినా మురుగునీరు రోడ్లపైకి, నివాసాల్లోకి చేరి గౌరీపేట దుర్గంధభరితంగా మారుతోంది. తీవ్ర దుర్వాసన, దోమల బెడదతో ఏళ్ల తరబడి రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి, ఆక్రమణలను తొలగించి సహజ కందకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News