నిన్న రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన పాతపాటి సర్రాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం జగన్. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా గతంలో సర్రాజు సేవలందించారు. భీమవరంలోని పెద్ద అమిరంలోని పాతపాటి సర్రాజు నివాసంలో భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించి, ధైర్యం చెప్పారు.
