Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CBN: అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం: సీఎం చంద్రబాబు

CBN: అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం: సీఎం చంద్రబాబు

డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్ జయంతి(Bhimrao Ramji Ambedkar Jayanti) సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. “ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది” అన్నారు భారతరత్న డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దాం.

- Advertisement -

అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం.  భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా… ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందాం. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News