వైసిపి ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్టని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో టిడిపి బంద్ సందర్భంగా గృహనిర్బంధం అనంతరం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని 74 సంవత్సరాలు వ్యక్తిని కనీసం ఆయన వయస్సును కూడా చూడకుండా ఆయనపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా ఆయన సంతకాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో వైసిపి ప్రభుత్వం ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడ్డారని అవి వారికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈరోజు జరిగిన బంద్ లో కూడా నీచ రాజకీయాలు చేసి టిడిపి నాయకులను ఇళ్ల నుండి బయటకు రాకుండా చేసి హౌస్ అరెస్టులకు పాల్పడ్డారన్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని, రాజకీయ కక్షలు మానుకోవాలన్నారు.
Bhuma Akhila: రాష్ట్రంలో అరాచక పాలన
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES