మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టిడిపి మాట్లాడుతూ నేడు వైసిపి పాలనలో ప్రజల సంక్షేమానికి భరోసా లేదన్నారు. ఒక్క ఛాన్స్ అని ప్రజలను అడిగి అధికారం వచ్చాక ప్రజలను నిట్ట నిలువన దోచుకుంటున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు నిత్యవసర వస్తువులపై పెరిగిన ధరల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో కుంటు పడిందన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని రాష్ట్రానికి సమర్థవంతమైన పాలకుడు అవసరమని అది చంద్రబాబే నన్నారు. ప్రజల సంక్షేమానికి వారి భవిష్యత్తుకు చంద్రబాబు మినీ మేనిఫెస్టో ద్వారాప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. మినీ మేనిఫెస్టోలో ప్రతి పథకం ప్రజలకు ఎంతో అవసరం అన్నారు. ప్రజల సంక్షేమ కోసం ఆకాంక్షించే చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించాలనిఆమె కోరారు. ప్రజలను వంచన గురి చేసిన వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తప్పక వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి టిడిపి మినీ మేనిఫెస్టో పథకాలపై నాయకులు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష ,ఇటిక్యాల శంకర్ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు, భూమా అభిమానులు పాల్గొన్నారు.
