ఆళ్లగడ్డ పట్టణ గ్రామాల పరిధిలోని వార్డులలో పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్ల నమోదుపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని మాజీమంత్రి భూమా అఖిలప్రియ సూచించారు. ఆళ్లగడ్డ పట్టణం రాష్ట్ర టీడీపీ ఆదేశాల మేరకు పట్టణంలోని టీఎస్ ఫంక్షన్ హాల్ లో ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులను అఖిలప్రియ ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులకు పార్టీ నియమించిన ట్రైనర్స్ హాజరయ్యారు. వారి ద్వారా ఓటర్ వెరిఫికేషన్, ఆర్టిఎస్, వాట్సాప్ గ్రూపుల విశిష్టతను గురించి క్లస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్చార్జులు బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్)లకు అవగాహన కల్పించారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు మరణించిన వారి, కొత్తగా పెళ్ళైన వారిని ఓటర్ల జాబితా నుండి ఎలా తొలగించాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. క్షేత్ర స్థాయి లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ఓటు నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని ఆమె సూచించారు పాల్గొన్నారు. దొర్నిపాడు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని అఖిలప్రియ ప్రారంభించారు. శిక్షణ తరగతుల ప్రత్యేకంగా పార్టీ నియమించిన ట్రైనర్స్ శిక్షణ తరగతులు హాజరైన వారికి ఆర్డీఎస్ పై అవగాహన కల్పించారు. బిఎల్ఏలకు కొత్త ఓటర్ నమోదు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
Bhuma Akhila: ఓటర్ల నమోదుపై అవగాహన పెంపొందించుకోవాలి
ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES