Thursday, January 15, 2026
Homeఆంధ్రప్రదేశ్Bhuma Akhilapriya: సర్పంచ్ గా శ్రీనివాసులును గెలిపించండి

Bhuma Akhilapriya: సర్పంచ్ గా శ్రీనివాసులును గెలిపించండి

ఈ నెల 19న పోలింగ్

ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్ల నాగ శ్రీనివాసులును అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ టిడిపి యువనాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి భార్గవ్ రామ్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు ఓటర్లను కోరారు. పెద్ద కందుకూరు గ్రామానికి చేరుకున్న వారికి టిడిపి కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో కలిసి వారు ఇంటింటికి వెళ్లి టిడిపి బలపరిచిన అభ్యర్థి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

- Advertisement -

ఈనెల 19న పోలింగ్ జరుగుతుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా టిడిపి బలపరిచిన అభ్యర్థి శ్రీనివాసులకు ఓట్లు వేయాలని అన్నారు. సగటు ప్రజల పరిస్థితి దీనంగా తయారైంది అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. పెద్ద కందుకూరు గ్రామంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందాన ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపి అడ్రస్ గల్లంతవుతుందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సూద్దాపల్లె చంద్ బాషా, యామాగురప్ప మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News