రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగావుంది . గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రైతు రాజు అవుతాడు రైతు దర్జాగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు, వైసిపి అధికారంలోకి వస్తే రైతు రాజు అవుతారని అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులను గాలికి వదిలేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు విచిత్రంగా అనిపిస్తుంది ఇది వైసిపి చూపిస్తున్న పనితీరు గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, పని చేశారు కానీ రైతుల సమస్యల పైన స్పందించి రైతులకు ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. గత ప్రభుత్వాలు రైతులకు అందజేసే సబ్సిడీ స్కీమ్స్ ఆపేశారన్నారు. రైతు బతకాలంటే రైతులు పంటలు పండించాలంటే సాగునీరు సమస్యలు తీవ్రంగా పెరగడానికి కారణం అంటే వైయస్సార్ ప్రభుత్వమే అన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర కోసం అధికారంలోకి రాలేదని తెలంగాణ రాష్ట్రం ప్రజలు మేలుకోరి వారి జీవితాలు బాగు చేయడానికి అధికారంలోకి వచ్చినట్టుందన్నారు. కృష్ణ బోర్డు కింద మనకు రావాల్సిన నీటి కేటాయింపులో మార్పులు తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెడుతుందని వారు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారని మీడియాలో తెలిసిందన్నారు. ఏపీకి రావలసిన నీటి కేటాయింపులో అడ్డుకుంటామని వైకాపా నాయకులయితేనేమి అధికారులు అయితేనేమి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Bhuma Akhilapriya: ప్రతి రైతుకు నీరు అందించే బాధ్యత ఎమ్మెల్యేదే
ఐదు రోజుల్లో కేసీ కెనాల్ రైతులకు నీరు తెప్పించాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES