Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma Akhilapriya: వై నాట్ పులివెందల?

Bhuma Akhilapriya: వై నాట్ పులివెందల?


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిసొంత పార్టీ ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన నిఘా పెట్టి తన నీడను తానే నమ్మే పరిస్థితుల్లో లేరని మాజీ మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.
3 స్థానాల్లో పట్టబద్రుల ఎమ్మెల్సీలను గెలిపించిన పట్టభద్రుల ఓటర్స్ అందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా ఉందని కేవలం మాటల గారడి తప్ప ఆచరణలో మాత్రం శూన్యం అన్నారు. మీరు చేసే పనులను ప్రతిదీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని నిన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో నిజాయితీగా పట్టభద్రులందరూ ఓటు వేసి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని ఆమె తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్ని జిమ్మిక్కులు చేసినా చదువుకున్న మేధావులు పట్టభద్రులు పొరపాటున కూడా వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్ర ప్రజలు క్షమించరని పట్టభద్రులు నిజాయితీగా టిడిపికి ఓటు వేసి గెలిపించారన్నారు. గతంలో ఒక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. వై నాట్ 175 అన్నారని, వై నాట్ 175 కాదు వై నాట్ పులివెందుల అని మాజీమంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.
మన రాష్ట్రం తప్పుదావ పడుతుంది, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతోనే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించిన పట్టభద్రుల ఓటర్స్ యువతకు ఉద్యోగాలు లేక పక్క ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకొనే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగదార్చిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులను ఎలా తప్పించుకోవాలి వైసిపి నాయకులు ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు ఎలా కప్పి పెట్టాలా వీటి కోసమే అధికారంలోకి వచ్చినట్లు ఉంది కానీ ప్రజల సమస్యలు ప్రజలకు సేవ చేయాలని మన రాష్ట్రాన్ని బాగుపరచలనే ఆలోచన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కక్ష రాజకీయాలు, కమర్షియల్ రాజకీయాలు తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయాలు చేయడం లేదన్నారు. ఎవరు అడగని మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి గొడవలు పెట్టి ఆ గొడవల వల్ల లబ్ధి పొందాలని నీచ రాజకీయాలు చేస్తుంది ఈ ప్రభుత్వం కాదా అని ఆమె ప్రశ్నించారు
దారిలో ఎవరైనా ఎమ్మెల్యేలు కనబడితే జగన్ మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు ఎమ్మెల్యేలు జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగితే చాలు అనే స్థితికి ఎమ్మెల్యేలు వచ్చారన్నారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గం లో అకాల వర్షంతో వడగళ్ల వర్షం పడి రైతులు నష్టపోతే రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డితో ఒక ఫోటో దిగి ఫోటోకు ఫోజులు ఇచ్చారు తప్ప కానీ రైతుల సమస్యలను ఎక్కడ పట్టించుకోలేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు
వచ్చే రోజుల్లో పెద్ద స్థాయిలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని, మీరు ఎన్ని ప్రలోభాలు గురిచేసిన ఓటర్స్ ని మీ వైపు తిప్పుకోలేకపోయారని, వచ్చే రోజుల్లో రాయలసీమ నుండి టిడిపి ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో కలిసి స్కూల్లో పనిచేసే సిబ్బందిని బెదిరించి వారందరితో దొంగ ఓట్లు విచ్చలవిడిగా వేశారని అయినా కూడా నైతిక విజయం మాదే అయిందని కేవలం ఉపాధ్యాయ ఎన్నికల్లో 169 ఓట్ల మెజార్టీతో గెలవడం వారి సత్తా ఏమిటో తెలిసిందన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో జాఫర్ రెడ్డి కౌన్సిలర్ హుస్సేన్ భాష నాగిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి చాంద్బాషా సోమల శేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News