Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Bhuma Akhilapriya: మహిళలు స్వయం కృషితో ఎదగాలి

Bhuma Akhilapriya: మహిళలు స్వయం కృషితో ఎదగాలి

బ్యూటీ పార్లర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

మహిళలు స్వయం కృషితో ఎదగాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని 11వ వార్డుకు చెందిన సుబహాని నూతనంగా ఏర్పాటు చేసుకున్న బ్యూటీ పార్లర్ ను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వార్డు కౌన్సిలర్ పసల భారతి తో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. మహిళలు స్వయం కృషితో అన్ని రంగాల్లో ముందు ఉండాలని తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఉండాలన్నారు. బ్యూటీ పార్లర్లో ఏర్పాటుచేసిన నిర్వాహకురాలు సుభాహాన్ని అభినందించారు. నిర్వాహకులు చిత్రపటాని భూమా అఖిలప్రియకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష, నాగిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad