ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కొన్ని అనివార్య కారణాలవల్ల పార్టీని వీడి బయటకు వెళ్లిపోయిన భూమా కార్యకర్తలు, నాయకులు తిరిగి తమ స్వంత గూటికి వస్తే వారిని అక్కున చేర్చుకుంటామని ఆళ్లగడ్డ టిడిపి యువనాయకుడు భూమా జగత్ విఖ్వాత రెడ్డి గెలుపునిచ్చారు. తమ స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వంత గూటికి రావాలనుకునే వారంతా తనను సంప్రదించాలని, తమ నాయకులు కార్యకర్తలు అందరితోపాటు వారిని కూడా కలుపుకొని వెళ్లి న్యాయం చేస్తామని భూమా హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థిగా భూమా అఖిలప్రియకు టికెట్ ను కేటాయించిన చంద్రబాబు, లోకేష్ లకు యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టికెట్ విషయంలో మొదటి నుండి కూడా తమకు ఎలాంటి సందేహం లేదన్నారు. ఒక మంచి విషయం కన్నా… ఒక చెడు విషయం ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో తమకు తెలుసని అదే కోవలో ఎందరో చేసిన ఆలోచనలకు తమకే టికెట్ కేటాయింపుతో పుల్ స్టాప్ పడిందని అన్నారు. రానున్న ఎన్నికలలో నియోజకవర్గంలో భారీ మెజారిటీతో భూమా అఖిలప్రియను గెలిపించుకుంటామని, ఆళ్లగడ్డ కోటపై టిడిపి జెండాను ఎగుర వేస్తామని భూమా విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు.
నేను, అక్కా వేరుకాం..
అఖిల ప్రియా అక్క… తాను వేరు వేరు కాదని ఆమె ప్రతి విజయంలో తాను ఎప్పుడూ వెన్నంటి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో ఇప్పటికే పలు మీటింగులు, ప్రెస్మీట్లలో తాను పాల్గొనడం తనపై ఎంతో నమ్మకంతో గురుతర బాధ్యతలు అప్పజెప్పిన చంద్రబాబు, లోకేష్ బాబులకు భూమా కృతజ్ఞతలు తెలిపారు. మరో 40 రోజులలో రాష్ట్రంలో టిడిపి విజయం సాధించి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని భూమా విఖ్యాత్ రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక యువత పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామన్నారు. ఈరోజు 18 సంవత్సరాలు నిండిన యువత అంతా తమ ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకునే ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించేందుకు గాను యువత అంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని యువనేత భూమా జగద్విఖ్యాత రెడ్డి పిలుపునిచ్చారు.