Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma Kishore: కేసీ కెనాల్ నీరందించి, ఆదుకోవాలన్న భూమా కిషోర్ రెడ్డి

Bhuma Kishore: కేసీ కెనాల్ నీరందించి, ఆదుకోవాలన్న భూమా కిషోర్ రెడ్డి

కేసీ కెనాల్ నీరివ్వకపోతే ఊరుకోను

కేసీ కెనాల్ నీరు రాక ఆళ్లగడ్డ రైతులు ఇబ్బందులు పడుతున్నారని బిజెపి సీనియర్ నాయకుడు ఇన్చార్జి భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రతిరోజు చూస్తున్నామని రైతుల పరిస్థితి దొర్నిపాడు ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ మండలం కేసీ కెనాల పైన ఆధారపడిన రైతులందరి పొలాలకు నీరందక ఇబ్బంది పడుతున్నారన్నారు. రెండు రోజుల క్రిందట నీరు వదిలారని 19వ బ్లాక్ దగ్గర యర్రగుడి దీన్నే, 18 లాక్ దగ్గర వచ్చే నీరు మళ్లీంచారని, వచ్చే నీరుని రైతులు ఎవరు వాడుకోకుండా ఎమ్మెల్యే కు సంబంధించిన వారి బంధువులు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న రైతులను బెదిరిస్తూ వారికి నీరు రాకుండా కిందికి నీరు పోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుమార్ కిషోర్ రెడ్డి తెలిపారు. తమకు మా పొలాలకు నీరు రాకుండా చేస్తున్నారని రైతులు స్వయంగా ఫోన్ చేసి తెలుపుతున్నారని ఆయన చెప్పారు వారి పొలాలకు మాత్రమే నీళ్లను పంపించుకుంటూ లాక్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు. నీటి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. మీ పొలాలకు మాత్రమే మీరు పెట్టుకుంటే ఇతర రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. శాంతి నగరం, బత్తలూరు ఎర్రగుంట్లకు పోలాలు రైతులు ఇబ్బంది ఎదుర్కోరా మీకు వందల ఎకరాలు పొలాలు ఉన్నాయని నీరు తీసుకోవడం న్యాయమేనా అన్నారు. ఎమ్మెల్యే రైతుల గురించి ఆలోచించే ఆలోచన ఉందా గంగుల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారులుగా ఉన్నారు ఆయన రైతుల గురించి ఆలోచించారా రైతులను ఎడ్యుకేట్ చేస్తామన ఆలోచించారా, రైతులు తూతూ మంత్రంగా పంటలు వేసి వదిలేస్తారా, రైతులు తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోరని రైతులు పంటలు వేసి పండించాలని ఆలోచిస్తారన్నారు దాని మీరు ఎడ్యుకేట్ చేయాలి అది మీ బాధ్యత అన్నారు. నీళ్లు తెచ్చే బాధ్యత మీదే అన్నారు. పది రోజుల్లో మరో తడి నీరు రాకపోతే రైతుని ఇబ్బంది పడతారన్నారు. గతంలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదని కాదని ఇలాంటి సమస్యలు వచ్చాయని అయినా కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఎంతో కష్టపడి వెలుగోడు నుండి నీరు తెచ్చారన్నారు. రైతుల గురించి ఆలోచించే నాయకులు లేరా అనుభవం ఉన్న నాయకులు కూడా ఆలోచించరా కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితమా మాజీ ఎంపీ ప్రతాపరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు మూడుసార్లు ఎంపీగా ఉన్నారు. రైతులు తక్కువ నీరు వాడుకోమని సలహా ఇస్తున్నారే రైతుల కోసం కలిసి పోరాడితే నీరు ఎందుకు రాదని ఆయన అన్నారు, రైతుల కోసం పోరాడితే ప్రజలు ముందుకు వస్తారన్నారు. రైతులకు నీరు ఇవ్వాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎమ్మెల్యే ఇంతవరకు కేసీ కెనాల్ గురించి మాట్లాడడం లేదని పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే రోజుల్లో రైతులు మరొక తడి నీరు రాకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని నీరు వదలడానికి రేపు లాస్ట్ అంటున్నారని బలమున్నోవాడు చిన్న చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారని అధికారులు వెంటనే చర్య తీసుకుని రైతులకు అందరికీ నీరు అందించాలని అధికారంలో ఉన్న నాయకులు వెంటనే స్పందించాలని మీరు అందించే బాధ్యత వారిది అన్నారు. వెలుగోడులో తాము ధర్నా నిర్వహిస్తామని భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. అంబటి మహేశ్వర్ రెడ్డి ,నాగిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి, అన్నెం ఓబుల్ రెడ్డి,

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News